యువతిని మోసగించిన కానిస్టేబుల్ ​అరెస్ట్

యువతిని మోసగించిన కానిస్టేబుల్ ​అరెస్ట్
x

యువతిని మోసగించిన కానిస్టేబుల్​అరెస్ట్

Highlights

జీవితంలో మోసపోతే పోలీసులను ఆశ్రయిస్తాం మరి కాపాడాల్సిన పోలీసే మోసం చేస్తే..? ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిథిలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఓ యువతిని...

జీవితంలో మోసపోతే పోలీసులను ఆశ్రయిస్తాం మరి కాపాడాల్సిన పోలీసే మోసం చేస్తే..? ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిథిలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఓ యువతిని వివాహం చేసుకుంటానని మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడు కానిస్టేబుల్ అభిలాష్ కుమార్ యాదవ్. అంతటితో ఆగకుండా గర్భవతి అయిన ప్రతిసారీ గుట్టుచప్పుడు కాకుండా ఆ యువతికి అబార్షన్ చేయిస్తూ వచ్చాడు. ఇదిలా ఉండగా అతడు మరోమహిళను పెళ్లాడినట్లు ఆమెకు తెలిసింది. ఈ విషయంపై అతడిని నిలదీయగా, మాయమాటలతో సమాధాన పరిచే యత్నం చేశాడు. బాధితురాలు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని అరెస్టుచేశామని ఎస్‌హెచ్‌ఓ అశోక్‌రెడ్డి తెలిపారు. గతంలో సదరు మహిళ కూడా ఓ నేరం చేసి కటకటాలు లెక్కించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories