V Hanumantha Rao: కాంగ్రెస్‌ సీనియర్ నేత వీహెచ్ ఆందోళన

*హైదరాబాద్ లక్డికాపూల్ పెట్రోల్‌ బంక్‌ దగ్గర ధర్నా *పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ రోడ్డుపై బైఠాయింపు

Shilpa
Updated on: 26 Oct 2021 1:43 PM IST
Congress‌ Senior Leader V Hanumantha Rao Concerns at Lakdikapool Petrol Bunk about Petrol and Diesel Prices
X

హైదరాబాద్ లక్డికాపూల్ పెట్రోల్‌ బంక్‌ దగ్గర ధర్నా

V Hanumantha Rao: కాంగ్రెస్‌ సీనియర్ నేత వీహెచ్ ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ లక్డికాపూల్ పెట్రోల్‌ బంక్‌ దగ్గర ధర్నా చేపట్టారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక సామాన్యుడి నడ్డి విరిచేలా పెట్రోల్ ధరలు భారీగా పెంచారని మండిపడ్డారు.

కాంగ్రెస్ హయాంలో 50 రూపాయలు ఉన్న పెట్రోల్ ధర ఇప్పుడు ఏకంగా 110 రూపాయలకు చేరిందని విమర్శించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ రెండు దేశ ప్రజలను గ్యాస్, పెట్రోల్ పేరుతో దోచుకుంటున్నాయని ఆరోపించారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే వరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు వీహెచ్.

Shilpa

Shilpa

Next Story