Revanth Reddy open Letter to KCR: కేసీఆర్‌ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

Revanth Reddy open Letter to KCR: ఏపీలో అక్ర‌మంగా నిర్మిస్తున్న‌ ప్రాజెక్టులకు సీఎం కేసీఆర్ పరోక్ష సహకారం ఉన్న‌ద‌ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ. రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Karampoori Rajesh
Published on: 9 Aug 2020 11:14 PM IST
Revanth Reddy open Letter to KCR: కేసీఆర్‌ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
X
Congress MP Revanth Reddy open Letter to CM KCR

Revanth Reddy Open Letter to KCR: ఏపీలో అక్ర‌మంగా నిర్మిస్తున్న‌ ప్రాజెక్టులకు సీఎం కేసీఆర్ పరోక్ష సహకారం ఉన్న‌ద‌ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ. రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర జలశక్తి మంత్రి వద్ద జరిగే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ వాయిదా వేయాలని కోరటమే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో లిఫ్ట్ సామర్థ్యాన్ని ఒక టీఎంసీకి తగ్గించారని, తద్వారా నారాయణ్ పేట్, కొడంగల్ కు నీరు రావటం సాధ్యంకాదన్నారు.

ఈ మేర‌కు సీఎం కేసీఆర్ కు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఈ ప్రాజెక్టు దిగువ ఉన్న ఒక లక్షా 7 వేల ఎకరాలకు సాగునీరు రాకుండా చేసిన పాపం మీదేనన్నారు. నారాయణ పేట్, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి ఉమ్మడి రాష్ట్రంలోనే 133కోట్ల నిధులు మంజూరైన ఎందుకు తొక్కిపెట్టారని ప్రశ్నించారు. ఈ పథకాన్ని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై సుప్రీం కోర్టులో తెలంగాణ వేసిన పిటిషన్ లో పసలేదని ఆరోపించారు. వైసీపీలోని కీలక నేతలు తెలంగాణలో వేల కోట్ల ప్రాజెక్టులు చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

Karampoori Rajesh

Karampoori Rajesh

Next Story