Mood of the Nation poll: పాపులర్ సీఎంల లిస్ట్: మూడో స్థానంలో జగన్, 9వ స్థానంలో కేసీఆర్

Arun Chilukuri
Published on: 8 Aug 2020 10:55 AM IST
Mood of the Nation poll: పాపులర్ సీఎంల లిస్ట్: మూడో స్థానంలో జగన్, 9వ స్థానంలో కేసీఆర్
X

Mood of the Nation poll: దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో ఏపీ సీఎం జగన్‌ మూడోస్థానంలో నిలిచారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ తొమ్మిదో స్థానంలో నిలిచారు. ప్రముఖ జాతీయ మీడియా ఇండియా టుడే మూడ్ అఫ్ ది నేషన్ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 19 రాష్ట్రాల్లోని 97 లోకసభ నియోజకవర్గాల్లో ఆ సర్వే జరిగింది.

జులై 15 నుంచి 27 తేదీ మధ్య 12,021 మందిని టెలిఫోన్ ద్వారా ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూల ద్వారా అభిప్రాయాలను సేకరించి, విశ్లేషించారు. కాగా.. అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎంలలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కు ప్రథమ స్థానం దక్కగా.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రెండో స్థానంలో నిలిచారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(4), ఇతరులు(5), బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌(6), మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే(7), ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌(8), రాజస్తాన్‌ సీఎం అశోక్‌ గెహ్లట్‌(10) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story