పేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను అందించడంలో ప్రభుత్వం విఫలం: ఎంపీ రేవంత్‌రెడ్డి

తెలంగాణ సర్కార్‌ పేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను అందించడంలో విఫలమైందని ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

admin1
Updated on: 24 Feb 2020 1:23 PM IST
పేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను అందించడంలో ప్రభుత్వం విఫలం: ఎంపీ రేవంత్‌రెడ్డి
X
Revanth Reddy File Photo

తెలంగాణ సర్కార్‌ పేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను అందించడంలో విఫలమైందని ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఇవాళ పట్నంగోస కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. గతంలో పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామని... కేసీఆర్‌ నేరుగా వెళ్లి హామీ ఇచ్చిన అల్వాల్‌ భూదేవినగర్‌లో ప్రజాలతో ముఖాముఖీ నిర్వహించనున్నారు.

ఎన్నికల్లో కేసీఆర్‌ ఇచ్చిన హామీల వైఫల్యంపై మాట్లాడనున్నారు. నేటి నుంచి ఐదు రోజుల పాటు మల్కాజిగిరి ఎంపీ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతికి కౌంటర్‌గా పట్నంగోస కార్యక్రమాన్ని చేపట్టారు ఎంపీ రేవంత్‌రెడ్డి. ప్రజల వద్దకు వెళ్లి.. సమస్యలు తెలుసుకోనున్నారు.



admin1

admin1

Next Story