టీఆర్ఎస్-బీజేపీ మధ్య అంతర్గత ఒప్పందం -రేవంత్ రెడ్డి
గ్రేటర్ ఎన్నికల్లో లబ్దిపొందేందుకు పట్టణ ప్రగతితో మరోసారి మోసం-రేవంత్
Revanth Reddy File Photo
పట్టణ ప్రగతి పేరుతో చేసిన పాపాలను మాపీ చేసుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు మొదలు పెట్టిందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. త్వరలో జరగబోయో గ్రేటర్ ఎన్నికల కోసం పట్టణ ప్రగతి ద్వారా ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. త్వరలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో పట్నంగోస పేరుతో ప్రజా సమస్యలు ఎండగడుతామన్నారు. పేద ప్రజలకు కట్టిస్తామన్న డబుల్ బెడ్ రూం ఇళ్లు నెలలు గడుస్తున్నా నేటికి అమలు కాలేదన్నారు.
పేదల ఇళ్ల కోసం కేంద్రం ఇచ్చిన నిధులు దారి మళ్లించారని..పార్లమెంట్ సాక్షిగా కేంద్రం దృష్టికి తీసుకు వెళ్తామని చెప్పారు. టీఆర్ఎస్-బీజేపీ మధ్య అంతర్గత ఒప్పందంతో ఇదంతా జరుగుతుందని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టుల పై ప్రభుత్వం ఆర్భాటాపు ప్రకటనలతో ప్రజలను మోసం చేస్తున్నారని జలు గమనించాలని రేవంత్ రెడ్డి కోరారు.
Next Story


