టీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ

టీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ
x
Highlights

హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ లో అధికార పార్టీ టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నాయకులకు మధ్య జరిగిన వాగ్వాదంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త...

హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ లో అధికార పార్టీ టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నాయకులకు మధ్య జరిగిన వాగ్వాదంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. చిన్నగా మొదలైన గొడవ కాస్త చిలికి చిలికి పెద్దవానగా మారి ఇరు వర్గాల మధ్య తోపులాటకు దారి తీసింది. ఇక ఈ గొడవ జరగడానికి గల అసలు కారణాల్లోకెళితే హైదరాబాద్ నగరంలో శుక్రవారం భారీగా కురిసిన వర్షాలకు సెల్లార్‌లో చేరిన వర్షపు నీటితో షార్ట్ సర్క్యూట్ జరిగి ఓ వ్యక్తి చనిపోయిన విషయం తెలిసిందే. బయటికి వెళ్లొస్తానంటూ కుటుంబ సభ్యులకు చెప్పిన హైకోర్టు ఉద్యోగి రాజ్ కుమార్ విద్యుద్ఘాతంతో విగతజీవిగా మారిన విషయం తెలిసిందే.

దీంతో రాజ్ కుమార్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ముషీరాబాద్‌లోని ఆయన ఇంటి ముందు యువజన కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. రాజ్ కుమార్ ఇంటి వద్దకు తీసుకొచ్చి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సరిగ్గా అదే సమయానికి అటుగా వెళ్తున్న ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ విషయం తెలిసి టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆ తర్వాత పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితి చక్కదిద్దారు.

Show Full Article
Print Article
Next Story
More Stories