Choppadandi: పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు

S. Srikanth
Published on: 9 April 2020 2:12 PM IST
Choppadandi: పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు
X

చొప్పదండి: కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ నేపథ్యంలో సేవలందిస్తున్న, చొప్పదండి మునిసిపాలిటీ పారిశుధ్య కార్మికులకు బియ్యం, పప్పు, నూనె, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు మొదలగు నెలకు సరిపడే నిత్యావసర సరుకులు, కాంగ్రెస్ నాయకుడు మేడిపల్లి సత్యం పంపీణీ చేసారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ... కరోనా నివారణలో మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికులు చేస్తున్న సేవలు అమోఘమని అన్నారు. అలాగే కరోనా నివారణకై అందరూ సామాజిక దూరం పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



S. Srikanth

S. Srikanth

Next Story