పూజ చేసి ప్రచారాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ నేతలు

పూజ చేసి ప్రచారాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ నేతలు
x
వడ్డెపల్లి సుభాష్ రెడ్డి, జనార్దన్ గౌడ్
Highlights

రాష్ట్రంలో ఇష్టారాజ్యాంగా పాలన తయారైందని, తెరాసకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనేనని పేర్కొన్నారు.

ఎల్లారెడ్డి: మున్సిపాలిటీ కేంద్రంలోని, గండిమాసానిపేట్ ఆంజనేయ స్వామి మందిరంలో పూజలు నిర్వహించి, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ వడ్డెపల్లి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్, వారితో పాటు పాల్గొన్న ఇతర ముఖ్య నాయకులు ఆయన వెంట ఉన్నారు.

ఆయన మాట్లాడుతూ... ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పై, కాంగ్రెస్ జెండా ఎగరేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.తెరాస ప్రభుత్వం గత హామీలను మరిచిందని, కేవలం ఓట్లు అడిగేటప్పుడే గొప్పగా హామీలు ఇవ్వడం, గెలిచాక హామీలను మరచిపోవడం తెరాసకి మామూలే అన్నారు. రాష్ట్రంలో ఇష్టారాజ్యాంగా పాలన తయారైందని, తెరాసకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనేనని ఆయన పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories