KTR: కాంగ్రెస్‌ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్టే..

KTR: తెలంగాణ భవన్ లో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఖమ్మం నేత తెల్లం వెంకట్ రావు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

Arun Chilukuri
Published on: 17 Aug 2023 3:26 PM IST
Congress Leader Tellam Venkata Rao Joined In BRS Party
X

KTR: కాంగ్రెస్‌ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్టే..

KTR: తెలంగాణ భవన్ లో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఖమ్మం నేత తెల్లం వెంకట్ రావు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌ కుమార్‌, బీఆర్‌ఎస్‌ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు సమక్షంలో హైదరాబాద్‌లో తన అనుచరులతో కలిసి ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్‌ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లేనని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ స్వభావం తెలుసుకోవడానికి తెల్లం వెంకట్రావుకు నెలకంటే ఎక్కువ సమయం పట్టలేదని అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story