Telangana: వైసీపీ నుంచి టీఆర్ఎస్‌లోకి వెళ్లినవారే షర్మిల పార్టీలోకి వెళ్తారు-భట్టి

Telangana: నాగార్జునసాగర్ ఉపఎన్నిక తర్వాత పీసీసీ మార్పు ప్రకటన ఉంటుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు.

Arun Chilukuri
Published on: 24 March 2021 8:06 PM IST
Congress Leader Bhatti Vikramarka Chit Chat with Media
X

Telangana: వైసీపీ నుంచి టీఆర్ఎస్‌లోకి వెళ్లినవారే షర్మిల పార్టీలోకి వెళ్తారు-భట్టి విక్రమార్క

Telangana: నాగార్జునసాగర్ ఉపఎన్నిక తర్వాత పీసీసీ మార్పు ప్రకటన ఉంటుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. మీడియా చిట్ చాట్ లో భట్టి మాట్లాడుతూ పీసీసీ నియామకంపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికపై ఎమ్మెల్సీ ఎన్నికల ప్రభావం ఉండబోదన్నారు. ఇక్కడి నుంచి జానారెడ్డి మంచి మెజార్టీతో గెలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. షర్మిల పార్టీతో కాంగ్రెస్ ఏం నష్టం లేదని.. వైసీపీ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లినవారే షర్మిల పార్టీలోకి వెళ్తారని చెప్పుకొచ్చారు. షర్మిలతో టీఆర్ఎస్ పార్టీకే ఎక్కువ నష్టం వాటిల్లుతుందన్నారు భట్టి విక్రమార్క.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story