Harish Rao: కాంగ్రెస్‌ రైతులను మోసం చేస్తోంది

Harish Rao: అసెంబ్లీలో కాంగ్రెస్‌ను నిలదీస్తాం

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 21 May 2024 6:20 PM IST
Congress Is Cheating The Farmers Says Harish Rao
X

Harish Rao: కాంగ్రెస్‌ రైతులను మోసం చేస్తోంది

Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్లకు బోనస్‌ విషయంలో రైతాంగాన్ని రేవంత్ సర్కార్ మోసం చేస్తుందని ఆరోపించారు. మేనిఫెస్టో హామీ ప్రకారం వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని.. ఇక మేనిఫెస్టోలో ఉన్నవి అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోలు విధానం సరిగా లేదన్న హరీష్‌రావు.. సీఎం చెప్పినా మిల్లర్లు స్పందించడం లేదని విమర్శించారు. రైతు బంధు పాక్షికంగా మాత్రమే ఇచ్చారన్న హరీష్‌రావు.. అసెంబ్లీలో కాంగ్రెస్‌ను నిలదీస్తామని హెచ్చరించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story