KTR: విద్యార్ధులు, నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేస్తుంది

KTR: ఎన్నికల కోసం రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నాడు నిరుద్యోగులను వాడుకున్నారు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 11 July 2024 7:45 PM IST
Congress government is cheating students and unemployed People Says KTR
X

KTR: విద్యార్ధులు, నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేస్తుంది

KTR: మెగా డీఎస్సీ అని చెప్పి కేవలం 6వేల అదనపు పోస్టులతో విద్యార్ధులు, నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేస్తుందని బీఆర్ఎస్ లీడర్ కేటీఆర్ విమర్శించారు. నాడు ఎన్నికల కోసం రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను వాడుకుందన్నారు. నిన్న ఓయూలో జరిగిన ఘటనపై కేసీఆర్ ఫైర్ అయ్యారు. విద్యార్ధులపై దాడులు చేస్తున్న పోలీసుల పేర్లను డైరీలో నమోదు చేస్తున్నామని, తాము అధికారంలోకి వచ్చాక వారిని వదిలిపెట్టం అంటూ హెచ్చరించారు.

ప్రజలపై దాడులు చేయడమే ప్రజాపాలనా అంటూ ప్రశ్నించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా భరించలేని నిరంకుశ మనస్తత్వం కలిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఆయన దుయ్యబట్టారు. జర్నలిస్టులపైనా పోలీసులతో దాడులు చేస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు వద్దన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 7 కొత్త వాటికి అనుమతులు ఇచ్చిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story