Congress: రేపు కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం

Congress: రేపటి సమావేశంలో తెలంగాణలో మిగతా.. 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం

Jyothi
Published on: 10 March 2024 3:09 PM IST
Congress Central Election Committee Meeting Tomorrow
X

Congress: రేపు కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం

Congress: రేపు కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. రేపటి సమావేశంలో తెలంగాణలో మిగతా..13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణ నుంచి పోటీ చేసే నలుగురు అభ్యర్థుల పేర్లను మొదటి లిస్ట్‌లో ప్రకటించింది. నల్లగొండ నుంచి కుందూరు జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి, జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్, మహబూబాబాద్ నుంచి బలరామ్‌నాయక్ పేర్లను తొలిజాబితాలో ప్రకటించింది. అన్ని చోట్ల గెలుపు గుర్రాలనే బరిలోకి నిలిపేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. తెలంగాణలో 13 నుంచి 14 ఎంపీ స్థానాలు గెలుపొందాలని ఆ పార్టీ టార్గెట్ గా నిర్ణయించుకుంది.

Jyothi

Jyothi

Next Story