Road Accident: ఎదురెదురుగా ఢీకొన్న కాలేజీ బస్సులు.. ఒకరు మృతి, విద్యార్థులకు తీవ్ర గాయాలు

Road Accident: మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని ఎల్లమ్మగుడి వద్ద BVRIT కాలేజీకి చెందిన రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 27 Sept 2024 11:56 AM IST
Road Accident: ఎదురెదురుగా ఢీకొన్న కాలేజీ బస్సులు.. ఒకరు మృతి, విద్యార్థులకు తీవ్ర గాయాలు
X

Road Accident: ఎదురెదురుగా ఢీకొన్న కాలేజీ బస్సులు

Road Accident: మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని ఎల్లమ్మగుడి వద్ద BVRIT కాలేజీకి చెందిన రెండు బస్సులు శుక్రవారం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక బస్సు డ్రైవర్ మరణించగా.... మరో బస్సు డ్రైవర్‌కి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో కాలేజీ విద్యార్థులు బస్సులోనే ఉన్నారని... వారిలో పలువురికి తీవ్రగాయాలు అయ్యాయని స్థానికులు తెలిపారు.

నర్సాపూర్, సంగారెడ్డి ప్రధాన రహదారిపై ప్రమాదం జరగడంతో 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్రేన్, జేసీబీలను ఏర్పాటు చేసి రోడ్డుపై ఉన్న బస్సులను పక్కకు తీయించారు. కాగా, మృతి చెందిన డ్రైవర్ నాగరాజు పటాన్‌చెరు వాసిగా గుర్తించారు. తీవ్ర గాయాల పాలైన మరో డ్రైవర్ యాదగిరిని సంగారెడ్డి వాసిగా పోలీసులు గుర్తించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story