Telangana: గ్రామంలో పల్లె ప్రగతి లక్ష్యాలు సాధించాలి: జిల్లా కలెక్టర్‌

జిల్లాలో నిర్వహిస్తున్న రెండో విడత పల్లెప్రగతి కార్యక్రమం లక్ష్యాలను సాధించేందుకు ప్రతి అధికారి చిత్తశుద్ధితో పని చేయాలని కలెక్టర్‌ సీహెచ్‌.శివలింగయ్య అధికారులను కోరారు.

S. Srikanth
Published on: 10 Jan 2020 12:47 PM IST
Telangana: గ్రామంలో పల్లె ప్రగతి లక్ష్యాలు సాధించాలి: జిల్లా కలెక్టర్‌
X

మహబూబాబాద్‌: జిల్లాలో నిర్వహిస్తున్న రెండో విడత పల్లెప్రగతి కార్యక్రమం లక్ష్యాలను సాధించేందుకు ప్రతి అధికారి చిత్తశుద్ధితో పని చేయాలని కలెక్టర్‌ సీహెచ్‌.శివలింగయ్య అధికారులను కోరారు. కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలతో నిర్వహించిన పల్లెప్రగతి సమన్వయ కార్యక్రమంలో మాట్లాడారు.

ప్రతి రోజు నిర్వహించిన పనుల నివేదికను అంతర్జాలంలో నిక్షిప్తం చేయక పోవడంతో రాష్ట్ర స్థాయి గ్రేడింగ్‌లో వెనకబడిపోతున్నామని అధికారులను మందలించారు. జాయింట్ కలెక్టర్‌ ఎం.డేవిడ్‌, జిల్లా పంచాయతీ అధికారి రంగాచారి, జిల్లా ప్రజా పరిషత్‌ ముఖ్యకార్యనిర్వహణాధికారి ఆర్‌.సన్యాసయ్య తదితరులు పాల్గొన్నారు.

S. Srikanth

S. Srikanth

Next Story