Shamshabad: కుప్పకూలిన హోండా షోరూమ్ భవనం.. కొత్త వాహనాలు ధ్వంసం

Shamshabad: అధికారులు పట్టించుకోకపోవడంతో..ప్రమాదం జరిగిందంటున్న స్థానికులు

Shekhar G
Published on: 10 Feb 2024 3:53 PM IST
Collapsed Honda showroom building in Shamshabad
X

Shamshabad: కుప్పకూలిన హోండా షోరూమ్ భవనం.. కొత్త వాహనాలు ధ్వంసం

Shamshabad: శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో హోండా షోరూం భవనం కుప్పకూలింది. కొత్త వాహనాలపై భవనం కుప్పకూలడంతో వాహనాలు ధ్వంసమయ్యాయి. హోండా షోరూంలోని ఉద్యోగులంతా పరుగులు తీశారు. అదే భవనంలో బోరు వేస్తుండగా వైబ్రేషన్ రావడంతో భవనం కుప్పకూలింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఈ భవనం కొన్ని సంవత్సరాల నాటిది కావడంతో శిథిలావస్థకు చేరింది. మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రమాదం జరిగినట్లు స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

శిథిలావస్థలో ఉన్న భవనాలు శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అనేకం ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు చర్యలు చేపట్టకపోతే రానున్న రోజుల్లో మరెన్నో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని స్థానికులు అంటున్నారు.

Shekhar G

Shekhar G

Next Story