CM Revanth Reddy: అమరులైన కానిస్టేబుల్‌, ఏఎస్సై కుటుంబాలకు రూ.కోటి పరిహారం

CM Revanth Reddy: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 21 Oct 2024 11:03 AM IST
CM Revanth Reddy: అమరులైన కానిస్టేబుల్‌, ఏఎస్సై కుటుంబాలకు రూ.కోటి పరిహారం
X

CM Revanth Reddy: అమరులైన కానిస్టేబుల్‌, ఏఎస్సై కుటుంబాలకు రూ.కోటి పరిహారం

CM Revanth Reddy: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. విధినిర్వహణలో వీరమరణం పొందిన పోలీసు అధికారుల కుటుంబాలకు ఇస్తున్న పరిహారాన్ని పెంచుతున్నట్లు రేవంత్ ప్రకటించారు. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ASIలు మరణిస్తే... కోటి రూపాయల పరిహారం ఇస్తామన్నారు. SI, CIలు మరణిస్తే కోటి 25 లక్షలు, DSP, ASPలు వీరమరణం పొందితే కోటి 50 లక్షలు, ఎస్పీ, IPSలు మరణిస్తే 2 కోట్ల రూపాయలను అమరుల కుటుంబాలకు ఇస్తామన్నారు రేవంత్ రెడ్డి.

హైదరాబాద్‌లోని గోషామహల్‌ స్టేడియంలో నిర్వహించిన పోలీసు సంస్మరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. శాంతి భద్రతలు, నిఘా విషయంలో రాష్ట్ర పోలీసుల పాత్ర కీలకమని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story