Revanth Reddy: సొంతూరికి సీఎం.. కోట్ల రూపాయల నిధులతో గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు

Revanth Reddy: నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో జరుగనున్న దసరా వేడుకల్లో సీఎం పాల్గొననున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 12 Oct 2024 3:43 PM IST
Revanth Reddy
X

Revanth Reddy

Revanth Reddy: నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో జరుగనున్న దసరా వేడుకల్లో సీఎం పాల్గొననున్నారు. సీఎం హోదాలో తొలిసారి రేవంత్ సొంత గ్రామానికి మరి కాసేపట్లో వెళ్లనున్నారు. గ్రామస్తులతో కలిసి దసరా వేడుకల్లో పాల్గొననున్నారు సీఎం... కోట్ల రూపాయల నిధులతో గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.

నూతన గ్రామ పంచాయతీ, బీసీ భవనం, గ్రంథాలయం, పశువైద్య శాలలను సీఎం రేవంత్ ప్రారంభోత్సవం చేయనున్నారు. కొండారెడ్డి పల్లిని సౌరవిద్యుత్ ఆధారిత గ్రామంగా తీర్చి దిద్దేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 4 కోట్ల రూపాయల సొంత నిధులతో హనుమాన్ దేవాలయ నిర్మించారు సీఎం.. అయితే సీఎం రేవంత్ రాక కోసం గ్రామస్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సీఎం రేవంత్ వెళ్లనుండడంతో ఆ గ్రామంలో సందడి వాతావరణం మొదలైంది.. పోలీసులు పహరా కాస్తున్నారు.



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story