Revanth Reddy: ఢిల్లీకి సీఎం.. సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరుకానున్న రేవంత్‌రెడ్డి

Revanth Reddy: ఈనెల 19న సీడబ్ల్యూసీ కీలక సమావేశం

Jyothi
Published on: 18 March 2024 1:37 PM IST
CM Revanth Reddy will go to Delhi today
X

Revanth Reddy: ఢిల్లీకి సీఎం.. సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరుకానున్న రేవంత్‌రెడ్డి

Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. సీడబ్ల్యూసీ సమావేశానికి రేవంత్‌ హాజరుకానున్నారు. లోక్‌సభ ఎన్నికల నగరా మోగడంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోకు తుది మెరుగులు దిద్దుతుంది. ఈనెల 19న సీడబ్ల్యూసీ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. దేశంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. ఎన్నికల మేనిఫెస్టోకు ఆమోదం తెలపడమే సమావేశం ప్రధాన ఎజెండా కాబోతుంది.

ఇప్పటికే పేద మహిళలకు లక్ష రూపాయలు ఇవ్వడం.. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడం వంటి అనేక హామీలు గుప్పించిన కాంగ్రెస్..మరికొన్ని హామీలతో మేనిఫెస్టో రూపకల్పన చేసింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ తరపున పోటీ చేయనున్న లోక్ సభ అభ్యర్ధులను ఖరారు చేయనున్నారు. వివిధ రాష్ట్రాల్లో భాగస్వామ్య పార్టీలతో సీట్ల సర్దుబాటుపై కుదిరిన ఒప్పందాలకు ఆమోద ముద్ర వేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల ముందు ఇదే చివరి సీడబ్ల్యూసీ సమావేశం కానుంది.

Jyothi

Jyothi

Next Story