Revanth Reddy: ఇవాళ మహబూబ్‌నగర్‌కు సీఎం రేవంత్‌

CM Revanth Reddy to Mahbubnagar today
x

 Revanth Reddy: ఇవాళ మహబూబ్‌నగర్‌కు సీఎం రేవంత్‌ 

Highlights

Revanth Reddy: సీఎం హోదాలో తొలిసారి మహబూబ్‌నగర్‌‌కు రేవంత్‌

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యటించనున్నారు. సాయంత్రం ఎంవీఎస్‌ కాలేజ్ మైదానంలో నిర్వహించే ప్రజా దీవెన సభలో పాల్గొంటారు. మహబూ‌బ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి జనవరి 30న ప్రారంభించిన పాలమూరు న్యాయ్ యాత్రకు ముగింపుగా ఈ సభ నిర్వహిస్తోంది కాంగ్రెస్. సభకు హాజరవ్వాలని సీఎం రేవంత్‌ను వంశీచంద్ కోరారు. దీంతో ఇవాళ సీఎం ప్రజాదీవెన సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ సభద్వారా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల శంఖారావం పూరిస్తారని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక సీఎం రాక సందర్భంగా అటు పార్టీ శ్రేణులు, అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సభలో భారీగా జనసమీకరణ చేసేందుకు పార్టీ శ్రేణులు చర్యలు తీసుకుంటున్నాయి. సభా వేదికపై 3 వందల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories