Revanth Reddy: రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy: ఏఐసీసీ ఎలక్షన్‌ కమిటీతో భేటీ కానున్న రేవంత్‌

Jyothi
Published on: 6 March 2024 10:09 AM IST
CM Revanth Reddy to Delhi Tomorrow
X

Revanth Reddy: రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులపై ఫోకస్ పెంచాయి అన్ని పార్టీలు. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ 9 మందితో తొలి విడత జాబితా విడుదల చేయగా.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఇప్పటివరకు ఐదుగురు అభ్యర్థుల్ని ప్రకటించారు. దీంతో అధికార కాంగ్రెస్ కూడా వీలైనంత వేగంగా అభ్యర్థుల్ని ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. మీడియాతో చిట్‌చాట్‌ సందర్భంగా రేపు అభ్యర్థుల్ని ప్రకటిస్తామని సీఎం రేవంత్ వెల్లడించారు.

దీంతో ఆయన రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ ఎలక్షన్‌ కమిటీతో భేటీ కానున్నారు. సమావేశం అనంతరం లోక్‌సభ అభ్యర్థులపై క్లారిటీ రానున్నట్టు తెలుస్తోంది. ఏఐసీసీ ఆమోదంతో రేపు సాయంత్రం లేదా ఎల్లుండి కాంగ్రెస లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయి.

Jyothi

Jyothi

Next Story