నేడు ఢిల్లీకి సీఎం.. ఏఐసీసీ ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొననున్న రేవంత్ రెడ్డి

Delhi: నేడు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం

Jyothi
Published on: 13 March 2024 9:46 AM IST
CM Revanth Reddy To Delhi today
X

నేడు ఢిల్లీకి సీఎం.. ఏఐసీసీ ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొననున్న రేవంత్ రెడ్డి

Delhi: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ ఎన్నికల కమిటీ సమావేశానికి హాజరుకానున్నారు. రెండో జాబితా ఎంపీ అభ్యర్థులపై అధిష్టానంతో రేవంత్ చర్చలు జరపునున్నారు. ఇప్పటికే తెలంగాణలో 4 స్థానాలకు ఏఐసీసీ అభ్యర్థులను ప్రకటించింది. లోక్‌సభ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలు ఉండగా.. తొలి జాబితాలో నాలుగు స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ అభ్యర్థులను ప్రకటించింది. మహబూబ్‌నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి, నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డి, జహీరాబాద్ నుంచి జగదీశ్ షెట్కార్, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ బరిలోకి దిగనున్నారు. ఇంకా 13 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్‌ అధిష్టానం అభిప్రాయ సేకరణ చేస్తోంది.

ఢిల్లీలో సీఈసీ సమావేశంలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి...మిగితా 13 స్థానాలకు సంబంధించి అభ్యర్థులపై చర్చించనున్నారు. ఇప్పటికే కొంతమంది ఆశావహులు ఎంపీ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 17 స్థానాలకు సంబంధించి దాదాపు 309 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

Jyothi

Jyothi

Next Story