Revanth Reddy: కాంగ్రెస్ కార్యకర్తలకు సీఎం రేవంత్ కృతజ్ఞతలు

Revanth Reddy: రాహుల్ పాదయాత్ర ప్రజలను ఎంతో ప్రభావితం చేసింది

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 5 Jun 2024 5:17 PM IST
CM Revanth Reddy thanked Congress workers
X

Revanth Reddy: కాంగ్రెస్ కార్యకర్తలకు సీఎం రేవంత్ కృతజ్ఞతలు

Revanth Reddy: కాంగ్రెస్‌కు సంతోషకరమైన ఫలితాలు వచ్చాయని.. రాహుల్ పాదయాత్ర ప్రజలను ఎంతో ప్రభావితం చేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మోడీ ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రజలకు వివరించామన్నారు. ఎన్డీయే కూటమికి.. ఇండియా కూటమినే ప్రత్యామ్నాయం అన్నారు. తెలంగాణలో 8పార్లమెంట్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించామని, తమ వంద రోజుల పాలనను ప్రజలు మెచ్చుకున్నారన్నారు. తమకు వచ్చిన సీట్లే.. మా పాలనకు నిదర్శనమన్నారు రేవంత్. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలకు సీఎం రేవంత్ కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీని గెలిపించడానికి.. బీఆర్ఎస్ ఆత్మబలిదానం చేసుకుందని ఆరోపించారు. బీఆర్ఎస్ కావాలనే బలహీనమైన అభ్యర్థులను నిలిపిందని విమర్శించారు. 140 కోట్ల మంది ప్రజలు ప్రధానిగా మోడీని తిరస్కరించారని..ఆయన హుందాగా రాజకీయాల నుంచి తప్పుకోవాలి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story