CM Revanth Reddy: తెలంగాణ ఏం కోల్పోలేదు.. పెద్దాయన ఇంట్లో నలుగురి ఉద్యోగాలు తప్ప..

CM Revanth Reddy: గత ప్రభుత్వ పెద్దలు నిరుద్యోగుల గురించి ఎప్పుడూ ఆలోచించలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 11 Nov 2024 3:56 PM IST
CM Revanth Reddy Slams KCR
X

CM Revanth Reddy: తెలంగాణ ఏం కోల్పోలేదు.. పెద్దాయన ఇంట్లో నలుగురి ఉద్యోగాలు తప్ప..

CM Revanth Reddy: గత ప్రభుత్వ పెద్దలు నిరుద్యోగుల గురించి ఎప్పుడూ ఆలోచించలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. పది నెలల్లో ఏం కోల్పోయామన్నది ప్రజలకు అర్దమైందన్నారు. ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయంలో ఏఎంవీఐలకు నియామక పత్రాల అందజేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. పదినెలల్లో పెద్దాయన ఇంట్లో నలుగురికి ఉద్యోగాలు కోల్పోయారు తప్ప తెలంగాణ ప్రజలు కోల్పోయిందేమీ లేదన్నారు.

నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయి.. రైతులు రుణమాఫీతో రుణ విముక్తులయ్యారన్నారు. ఒక కోటి ఐదు లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో లబ్దిపొందారన్నారు. 49 లక్షల 90వేల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిందని.. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story