Revanth Reddy: పద్మ పురస్కారాల్లో తెలంగాణపై కేంద్రం వివక్ష

Dhivi
Updated on: 16 May 2025 2:59 PM IST
CM Revanth Reddy says the Center has discriminated against Telangana in the Padma awards
X

Revanth Reddy: పద్మ పురస్కారాల్లో తెలంగాణపై కేంద్రం వివక్ష

Revanth Reddy: పద్మ పురస్కారాల విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపించిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసంత్రుప్తి వ్యక్తం చేశారు. గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయధీర్ తిరుమలరావు వంటి ప్రముఖులకు పద్మశ్రీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించినా కేంద్రం వాటిని పరిగణలోనికి తీసుకోకపోవడం నాలుగు కోట్ల ప్రజలను అమానించడమే అన్నారు. 139 మందికి పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం తెలంగాణకు కనీసం 5 పురస్కరాలు కూడా ప్రకటించకపోవడంపై రేవంత్ రెడ్డి అసంత్రుప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రధాని మోదీకి లేఖ రాయాలనే యోచనలు ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ, ఏపీ నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన వారికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, నందమూరి బాలక్రిష్ణ, మందక్రిష్ణ, కేఎల్ క్రిష్ణ, మాడుగుల నాగఫణిశర్మ, దివంగత మిర్యాల అప్పారావు, రాఘవేంద్రాచార్య పంచముఖికి పద్మ పురస్కారాలు దక్కడంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. తాము ఎంచుకున్న రంగంలో చేసిన కృషి అంకితభావమే వారిని దేశంలోని ఉన్నత పురస్కారాలను ఎంపికయ్యేందుకు కారణమయ్యాయని రేవంత్ రెడ్డి తెలిపారు.

Dhivi

Dhivi

Next Story