Revanth Reddy: ప్రజాపాలన దరఖాస్తులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

Revanth Reddy: ఉదయం 11 గంటలకు సీఎం ఉన్నత స్థాయి సమావేశం

Jyothi
Published on: 8 Jan 2024 8:35 AM IST
CM Revanth Reddy Review of  Praja Palana Applications
X

 Revanth Reddy: ప్రజాపాలన దరఖాస్తులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష 

Revanth Reddy: ప్రజాపాలన దరఖాస్తులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. 11 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, సీఎస్ సహా ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టనున్నారు. డిసెంబర్ 28 నుంచి ఈనెల 6 తేదీ వరకూ చేపట్టిన దరఖాస్తుల స్వీకరణలో ప్రజాపాలనలో మొత్తం కోటి 25 లక్షల, 84 వేల 383 దరఖాస్తులు అందాయి. వీటిలో ఐదు గ్యారెంటీలకు సంబంధించి కోటీ 5 లక్షల, 91 వేల 636 అప్లికేషన్లు దాఖలయ్యాయి. ఇక ఇతర అంశాలకు సంబంధించి 19 లక్షల 92 వేల 747 దరఖాస్తులు అందినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.

ప్రజా పాలన దరఖాస్తుల అంశానికి సంబంధించి ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌ను రూపొందించారు. ఆ వెబ్‌సైట్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిరంచనున్నారు. జనవరి 17 వ తేదీలోగా డేటా ఎంట్రీని పూర్తి చేయాలని సంబంధిత కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. అయితే.. లోక్‌సభ ఎన్నికల ముందు అమలు చేయాల్సిన పథకాల సాధ్యాసాధ్యాలపై ఈరోజు చర్చించనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే వచ్చిన అప్లికేషన్లను పరిశీలించి.. తర్వాత చేపట్టాల్సిన చర్యలపై సమీక్ష చేయనున్నారు.

100 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగానే కార్యాచరణను మొదలుపెట్టింది. ఇప్పటికే రెండింటిని అమలు చేస్తున్నామన్న ప్రభుత్వం.. ఈ నెలలో మరో పథకాన్నీ అమలు చేయాలని భావిస్తోంది. అందుకు తగ్గట్టుగా.. నిధుల సమీకరణపై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఒక్కో పథకానికి ఎంత మంది అర్హులు ఉంటారన్న దానిపై సమీక్ష చేపట్టనున్న ప్రభుత్వం ఆమేరకు నిధులను సేకరించే పనిలో ఉన్నట్టు అధికార వర్గాల్లో టాక్ నడుస్తోంది.

జిల్లాల వారీగా అందిన దరకాస్తుల వివరాలు (లక్షల్లో )

హైదరాబాద్ : 13 .7

రంగారెడ్డి : 10 . 2

మేడ్చల్ మల్కాజిగిరి : 9 .2

నల్గొండ : 6 .1

నిజామాబాద్ : 5 .9

ఖమ్మం : 5 .5 .

సంగారెడ్డి : 4 .4

సిద్ధిపేట : 3 .8

సూర్యాపేట : 4 .2

జగిత్యాల : 3 .9

భద్రాద్రి కొత్తగూడెం : 3 .7

కరీం నగర్ : 3 .5 .

వరంగల్ : 3 .3

మహబూబ్ నగర్ : 3 .2

వికారాబాద్ : 3 .1

మెహబూబాబాద్ : 3 .1

కామారెడ్డి : 3 .1

హనుమకొండ: 2 .93

మంచిర్యాల : 2 .83

నిర్మల్ : 2 .80

మెదక్ : 2 .73

పెద్దపల్లి : 2 .69

యాదాద్రి బోనగిరి : 2 .54

ఆసిఫాబాద్ : 2 .20

రాజన్న సిరిసిల్ల : 2 .15

నారాయణ పెట్ :2 .09

నాగర్ కర్నూల్ : 2 .03

జోగులాంబ గద్వాల్ :1 .95

కొమురంభీం ఆసిఫాబాద్ : 1 .82

జయశంకర్ భూపాల్ పల్లి : 1 .46

ములుగు : 1 .10

మొత్తం :: 125 .84

Jyothi

Jyothi

Next Story