Revanth Reddy: నీతి అయోగ్ వైస్ ఛైర్మన్‌ సుమన్‌ భేరీతో సీఎం రేవంత్ భేటీ

Revanth Reddy: వెనుకబడిన ప్రాంతాల గ్రాంటు విడుదలకు సహకరించాలని వినతి

Jyothi
Published on: 6 Feb 2024 8:47 AM IST
CM Revanth Reddy Meet NITI Aayog Vice Chairman Suman Bery
X

Revanth Reddy: నీతి అయోగ్ వైస్ ఛైర్మన్‌ సుమన్‌ భేరీతో సీఎం రేవంత్ భేటీ

Revanth Reddy: వెనుకబడిన ప్రాంతాల గ్రాంటు విడుదలకు సహకరించాలని నీతి ఆయోగ్‌ను కోరారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో నీతి అయోగ్ వైస్ ఛైర్మన్‌ సుమన్‌ భేరీతో భేటీ అయిన ఆయన.. తెలంగాణ‌కు రావ‌ల్సిన 18 వందల కోట్లు వెంట‌నే విడుద‌ల‌ చేయాలన్నారు.

దీంతో పాటు హైద‌రాబాద్‌లో మూసీ న‌ది రివ‌ర్ ఫ్రంట్ అభివృద్ధికి అవ‌స‌ర‌మైన నిధులు ఇప్పించాల‌ని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకు అవ‌స‌ర‌మైన ప్రపంచ‌బ్యాంకు ఎయిడ్ విడుద‌ల‌కు మ‌ద్దతు ఇవ్వాల‌ని విజ్ఞప్తి చేశారు. తాగునీటి స‌ర‌ఫ‌రాకు అవ‌స‌ర‌మైన నిధులతో పాటు వైద్య,ఆరోగ్య, విద్యా రంగాల్లో తీసుకురానున్న సంస్కర‌ణ‌ల‌కు మ‌ద్దతివ్వాల‌ని విజ్ఞప్తి చేశారు.

Jyothi

Jyothi

Next Story