Revanth Reddy: శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్‌ దంపతులు

Revanth Reddy: సీఎం దంపతులకు వేదపండితులు ఆశీర్వాదం

Jyothi
Published on: 11 March 2024 12:27 PM IST
CM Revanth Reddy Couple visited Sri Lakshmi Narasimha Swamy
X

Revanth Reddy: శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్‌ దంపతులు

Revanth Reddy: సీఎంగా రేవంత్‌రెడ్డి యాదాద్రిలో తొలిసారి పర్యటించారు. యాద‌గిరి గుట్ట శ్రీ‌ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామిని సీఎం దంప‌తులు ద‌ర్శించుకొని పూజ‌లు నిర్వహించారు. సీఎం దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు సీఎం దంపంతులు ప్రత్యేక పూజలు చేశారు.

సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు, అమ్మవారికి ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ ఉన్నారు. సీఎంతో పాటు మంత్రులకు అర్చకులు వేద ఆశీర్వాదం అందించారు.

Jyothi

Jyothi

Next Story