Revanth Reddy: ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వే ప్రారంభించిన సీఎం రేవంత్

Revanth Reddy: ప్రజల సంక్షేమం కోసమే ఫ్యామిలీ డిజిటల్ కార్డులు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 3 Oct 2024 1:45 PM IST
CM Revanth launched a survey of family digital cards
X

Revanth Reddy: ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వే ప్రారంభించిన సీఎం రేవంత్

Revanth Reddy: వన్‌ స్టేట్‌.. వన్‌ కార్డ్‌ పేరుతో ఫ్యామిలీ డిజిటల్‌ కార్డులు అందుబాటులోకి తెస్తున్నామన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. 30 శాఖల వద్ద ఉన్న సమాచారాన్ని డిజిటల్‌ కార్డుగా మారుస్తున్నామని, అన్ని పథకాలకు డిజిటల్‌ కార్డు అనుసంధానం చేస్తామన్నారు. అర్హత కలిగినవారికి ఒక్క క్లిక్‌తో పథకాలు అందిస్తామన్నారు. రేషన్‌ నుంచి ఆరోగ్యశ్రీ వరకు కార్డు ఉపయోగపడుతుందన్నారు. ఆస్పత్రి రిపోర్టులు కూడా హెల్త్ కార్డులో డిజిటల్ రూపంలో ఉంటాయని స్పష్టం చేశారు సీఎం రేవంత్. వన్‌ స్టేట్-వన్ కార్డు పైలట్ ప్రాజెక్ట్‌ను ఆయన ప్రారంభించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story