Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

Revanth Reddy: నెహ్రూ కాలం నాటి ప్రాజెక్టులు ఇప్పటికీ ఉన్నాయి

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 26 Sept 2024 8:32 PM IST
CM Revanth key comments on Kaleshwaram project irregularities
X

Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై కీలక వ్యాఖ‌్యలు చేశారు. ప్రాజెక్టు అక్రమాల్లో ఎవరిని బాధ్యుల్ని చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అధికారులపై చర్యలు తీసుకుంటే ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌ మొత్తానికే ఖాళీ అవుతుందని.. చర్యలు తీసుకోకపోతే వారినే కొనసాగిస్తున్నామనే ఆరోపణలు వస్తాయని అన్నారు సీఎం రేవంత్. జలసౌధలో అసిస్టెంట్ ఎక్జిక్యూటివ్ ఇంజినీర్లకు నియామకపత్రాల అందజేత కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్.. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలను స్టడీ చేయాలని వారికి సూచించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story