శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠినంగా వ్యవహరించాలి.. డీజీపీకి సీఎం రేవంత్‌ ఆదేశాలు

శాంతి భద్రతలను కాపాడే విషయంలో సీరియస్‌గా ఉండాలని డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 13 Sept 2024 10:43 AM IST
CM Revanth directs DGP to take stringent action against disruptors of Law and Order
X

శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠినంగా వ్యవహరించాలి.. డీజీపీకి సీఎం రేవంత్‌ ఆదేశాలు

CM Revanth Reddy: లా అండ్ ఆర్డర్‌పై సీఎం రేవంత్ ఫోకస్ చేశారు. ఇవాళ లా అండ్ ఆర్డర్‌పై సమీక్ష నిర్వహించనున్నారు. శాంతి భద్రతలను కాపాడే విషయంలో సీరియస్‌గా ఉండాలని డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా ఎవరు ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారం పోయిందనే అక్కసుతో కొందరు కుట్రలు చేస్తున్నారని సీఎం రేవంత్ మండిపడ్డారు.

సైబరాబాద్ కమిషనర్లతో డీజీపీ జితేందర్ సమావేశమయ్యారు. శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదన్న డీజీపీ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. హైదరాబాద్, తెలంగాణలో పరిస్థితిని చెడగొట్టేందుకు ప్రయత్నించే వ్యక్తులపై జీరో టాలరెన్స్ ఉంటుందన్నారు. ప్రజలందరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని డీజీపీ విజ్ఞప్తి చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story