Hyderabad: పర్యటనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. స్వాగతం పలికిన సీఎం కేసీఆర్‌..

Hyderabad: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌ లో పర్యటించనున్నారు.

Arun Chilukuri
Published on: 16 Jun 2023 6:31 PM IST
CM KCR Welcome President Droupadi Murmu At Begumpet Airport
X

Hyderabad: పర్యటనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. స్వాగతం పలికిన సీఎం కేసీఆర్‌..

Hyderabad: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌ లో పర్యటించనున్నారు. ఈ మేరకు ముర్ము బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ముర్ముకు సీఎం కేసీఆర్ స్వాగతం పలికారు. గ‌వ‌ర్నర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్, బీజేపీ ఎంపీ కిష‌న్ రెడ్డి కూడా స్వాగ‌తం ప‌లికారు. రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో ముర్ము పర్యటించనున్నారు. ఈ రోజు రాత్రి రాజ్‌ భవన్‌లో ముర్ము బస చేస్తారు. రేపు ఉదయం 7 గంటలకు దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్ కు రాష్ట్రపతి వెళ్తారు. ఎయిర్‌ఫోర్స్ పరేడ్‌ లో ముర్ము పాల్గొననున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story