నేడు మరో రెండు నూతన కలెక్టరేట్లను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

నేడు మరో రెండు నూతన కలెక్టరేట్లను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

Arun Chilukuri
Published on: 12 Jan 2023 8:39 AM IST
CM KCR To Inaugurate Two New Integrated Collectorate Today
X

నేడు మరో రెండు నూతన కలెక్టరేట్లను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌ 

CM KCR: ఇవాళ సీఎం కేసీఆర్‌ మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 9గంటల 45 నిమిషాలకు మహబూబాబాద్‌కు చేరుకుంటారు సీఎం కేసీఆర్. ఉదయం 10 గంటలకు బీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీస్‌ను, ఉదయం 11 గంటలకు నూతన కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులతో కేసీఆర్‌ భేటీ అవుతారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కలెక్టరేట్‌లో అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించనున్నారు.

మహబూబాబాద్‌ జిల్లా పర్యటన అనంతరం అక్కడి నుంచి సీఎం కేసీఆర్‌ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనకు బయల్దేరతారు. మధ్యాహ్నం 2 గంటలకు పాల్వంచలో నూతన సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారు. అనంతరం అధికారులతో సమీక్షించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రోడ్డుమార్గాన కొత్తగూడెం చేరుకుంటారు సీఎం కేసీఆర్. కొత్తగూడెంలో బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు తిరుగుపయనమవుతారు సీఎం కేసీఆర్. సీఎం టూర్‌ నేపథ్యంలో ఆయా జిల్లాల మంత్రులు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story