Telangana: త్వ‌ర‌లోనే ఆర్టీసీ ఉద్యోగుల‌కు జీతాలు పెంచుతాం: సీఎం కేసీఆర్

Telangana: అసెంబ్లీ వేదికగా తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పారు సీఎం కేసీఆర్.

Arun Chilukuri
Published on: 26 March 2021 3:24 PM IST
CM KCR Says we Will Hike Salaries for RTC Employees
X

Telangana: త్వ‌ర‌లోనే ఆర్టీసీ ఉద్యోగుల‌కు జీతాలు పెంచుతాం: సీఎం కేసీఆర్

Telangana: అసెంబ్లీ వేదికగా తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పారు సీఎం కేసీఆర్. త్వరలోనే వారి వేతనాలను పెంచుతామని హామీ ఇచ్చారు. టీఎస్ఆర్టీసీ నష్టాల్లో నడుస్తోందని, దాన్ని కాపాడుకుంటూ వస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బడ్జెట్‌లో రూ. 3వేల కోట్లు కేటాయించామని చెప్పారు. ముందు ముందు ఆర్టీసీని ఇంకా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు కూడా త్వరలో జీతాలు పెంచుతామని కేసీఆర్ స్పష్టం చేశారు. జీతాలు పెంచాలని ఆర్టీసీ కార్మికులు విజ్ఞప్తి చేశారని, సంబంధిత మంత్రితో మాట్లాడి జీతాలు పెంచుతామన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story