CM KCR: సంగారెడ్డి, జహీరాబాద్‌పై సీఎం వరాల జల్లు

CM KCR: భారత్‌లో ప్రస్తుత పరిస్థితులు బాగోలేదు

Rama Rao
Published on: 21 Feb 2022 5:11 PM IST
CM KCR Said that he Should Play a Leading Role in the Politics of the Country
X

CM KCR: సంగారెడ్డి, జహీరాబాద్‌పై సీఎం వరాల జల్లు

CM KCR: సంగారెడ్డి, జహీరాబాద్‌పై వరాల జల్లు కురిపించారు సీఎం కేసీఆర్. 50 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. అలాగే.. మరో ఆరు మున్సిపాల్టీలకు 25 కోట్లు, జిల్లాలోని 6వందల 99 గ్రామాలకు 140 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. నిధుల మంజూరుకు సంబంధించిన జీవోను రేపే విడుదల చేస్తామన్నారు సీఎం కేసీఆర్.

భారత్‌లో ప్రస్తుత పరిస్థితులు బాగోలేదన్న సీఎం కేసీఆర్.. దేశం గురించి కొట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. దేశం కోసం పోరాటానికి బయలుదేరానని, అమెరికా కంటే గొప్ప దేశంగా భారత్‌ను తీర్చిదిద్దుతామన్నారు. దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించాలని అన్నారు సీఎం కేసీఆర్.

Rama Rao

Rama Rao

Next Story