పల్లె ప్రగతి కార్యక్రమం పురోగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష
KCR (File photo)
పల్లె ప్రగతి కార్యక్రమం పురోగతిపై సీఎం కేసీఆర్.. ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. పల్లె ప్రగతి కార్యక్రమాల పనితీరును పరిశీలించేందుకు జనవరి ఒకటో తేదీ నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ పల్లెల్లో చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాల పురోగతిని, వాటి నాణ్యతను.. ఈ ఫ్లయింగ్ స్క్వాడ్స్ అకస్మికంగా తనిఖీచేసి ప్రభుత్వానికి నివేదికలు ఇస్తాయి. స్వచ్చతకు అద్దం పడుతూ పచ్చనైన పరిశుభ్రమైన పల్లెల కోసం.. సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభించి, ప్రతిష్టాత్మకంగా అమలు పరిచిన 30 రోజుల పల్లె ప్రగతి కార్యక్రమం జనాదరణ పొందిందని సీఎం కేసీఆర్ తెలిపారు.
Next Story




