CM KCR Review Meeting on Education Department: ఇక విద్యావ్యవస్థ ప్రక్షాళన

CM KCR Review Meeting on Education Department: ఇక విద్యావ్యవస్థ ప్రక్షాళన
x
Highlights

CM KCR Review Meeting on Education Department : రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో​ ఉన్నత విద్యాశాఖపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమీక్షా...

CM KCR Review Meeting on Education Department : రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో​ ఉన్నత విద్యాశాఖపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. గురువారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో వర్సిటీ పరీక్షల నిర్వహణ, విద్యార్థులను ప్రమోట్ చేసే అంశంపై సీనియర్‌ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సిఎస్ సోమేశ్ కుమార్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, సీనియర్ అధికారులు నవీన్ మిట్టల్, ఉమర్ జలీల్, శ్రీహరి, శేషు కుమారి తదితరులు పాల్గొన్నారు.

విద్యావ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి, ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడానికి అవసరమైన దీర్ఘకాలిక వ్యూహం రూపొందించి, అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. దీనికోసం విద్యావేత్తలు, విషయ నిపుణులతో వెంటనే సమావేశం నిర్వహించి, అభిప్రాయాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. కరోనా నేపథ్యంలో వివిధ రకాల విద్యాసంస్థల నిర్వహణ, పరీక్షల నిర్వహణ, సిలబస్ తదితర విషయాలపై యుజిసి,ఎఐసిటిఇ తదితర సంస్థల మార్గదర్శకాలను పాటించాలని నిర్ణయించారు.

ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇతర ప్రభుత్వ విద్యాసంస్థలు ప్రస్తుతం ఎలా ఉన్నాయి? వాటిని గొప్పగా తీర్చిదిద్దేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఏం చేయాలి? అనే విషయాలపై త్వరలోనే ఓ వర్క్ షాప్ నిర్వహించి విద్యారంగ నిపుణులు, అనుభవజ్ఞుల అభిప్రాయాలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories