Prof. Jayashankar: ప్రొఫెసర్ జయశంకర్‌కు ఘన నివాళి- సీఎం కేసీఆర్

Prof. Jayashankar: తెలంగాణ స్వయం పాలనా స్వాప్నికుడు, స్వరాష్ట్రం కోసం సాగిన ఉద్యమాల్లో భావజాల వ్యాప్తికి తన జీవితాంతం కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్.

Arun Chilukuri
Published on: 21 Jun 2021 2:21 PM IST
CM KCR Recalled the Great Services Rendered by Prof. Jayashankar on his Death Anniversary
X

Prof. Jayashankar: ప్రొఫెసర్ జయశంకర్‌కు ఘన నివాళి- సీఎం కేసీఆర్

Prof. Jayashankar: తెలంగాణ స్వయం పాలనా స్వాప్నికుడు, స్వరాష్ట్రం కోసం సాగిన ఉద్యమాల్లో భావజాల వ్యాప్తికి తన జీవితాంతం కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ చరిత్ర లో చిరకాలం నిలిచిపోతారని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్థంతి సందర్భంగా సీఎం ఆయనను స్మరించుకున్నారు.

ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణలో పెడుతున్నదని, ప్రొఫెసర్ జయశంకర్ ఆలోచనలకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రం లో సబ్బండ వర్గాలు స్వయం సమృద్ధిని సాధిస్తున్నాయని సీఎం అన్నారు. ఒక్కొక్క రంగాన్ని సరిదిద్దుకుంటూ, దేశంలోని ఇతర రాష్ట్రాలతో అభివృద్ధిలో తెలంగాణ పోటీ పడుతూ, నూతన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ, తద్వారా ప్రొఫెసర్ జయశంకర్ కు ఘన నివాళి అర్పిస్తున్నదని సీఎం తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story