CM KCR: తెలంగాణ వీరత్వానికి ప్రతీక సర్వాయి పాపన్నగౌడ్‌..

CM KCR: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి ప్రతీక అని సీఎం కేసీఆర్ అన్నారు.

Arun Chilukuri
Updated on: 18 Aug 2022 7:30 PM IST
CM KCR Pays Tribute to Sardar Sarvai Papanna
X

CM KCR: తెలంగాణ వీరత్వానికి ప్రతీక సర్వాయి పాపన్నగౌడ్‌.. 

CM KCR: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి ప్రతీక అని సీఎం కేసీఆర్ అన్నారు. సబ్బండ వర్గాల ఆత్మగౌరవ స్ఫూర్తిగా నిలిచిన సర్వాయి పాపన్న వీరగాథను పాపన్న జయంతి సందర్భంగా సీఎం స్మరించుకున్నారు. ఆనాటి సమాజంలో నెలకొన్న నిరంకుశ రాజరిక పోకడలకు వ్యతిరేకంగా సబ్బండ వర్గాలను ఏకం చేసి, పాపన్న పోరాడిన తీరు గొప్పదని సీఎం అన్నారు.

పాపన్న గౌడ్ ప్రదర్శించిన ఆత్మగౌరవ పోరాట స్ఫూర్తిని తెలంగాణ రాష్ట్రం కొనసాగిస్తుందని సీఎం స్పష్టం చేశారు. సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ బడుగు, బలహీన వర్గాల నాయకత్వాన్ని సముచితంగా గౌరవించుకుంటున్నదని సీఎం అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story