CM KCR: భార‌త స్వాతంత్ర్య స‌మ‌రం ప్రపంచ చరిత్రలో ఒక మహోన్నత పోరాటం

CM KCR: హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో స్వాతంత్ర్య వజ్రోత్సవ ముగింపు వేడుకలు

Shekhar G
Published on: 1 Sept 2023 7:17 PM IST
CM KCR Participating In Closing Ceremony Of Swathantra Bharatha Vajrotsavalu At Hicc
X

CM KCR: భార‌త స్వాతంత్ర్య స‌మ‌రం ప్రపంచ చరిత్రలో ఒక మహోన్నత పోరాటం

CM KCR: మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం మనందరి బాధ్యతని సీఎం కేసీఆర్‌ అన్నారు. హెచ్‌ఐసీసీలో నిర్వహించిన స్వాతంత్ర్య వజ్రోత్సవ ముగింపు వేడుకుల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో లక్షలాది మంది ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల గొప్పతనం నేటి తరానికి సమగ్రంగా తెలియజేయాలన్నారు. స్వాతంత్ర్య సమరస్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రపంచానికి భారత్‌ ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. విభిన్న సంస్కృతుల ప్రజలను స్వాతంత్ర్యోద్యమం ఏకతాటిపై నిలిపిందని సీఎం కేసీఆర్‌ వివరించారు.

Shekhar G

Shekhar G

Next Story