CM KCR: పారిశుధ్య, ఆర్టీసి కార్మికులకు సీఎం కేసీఆర్‌ మే డే కానుక

CM KCR: నెల జీతం రూ.1000 పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం

Dhatripriya
Published on: 1 May 2023 7:05 PM IST
CM KCR May Day Gift To Sanitation And RTC Workers
X

CM KCR: పారిశుధ్య, ఆర్టీసి కార్మికులకు సీఎం కేసీఆర్‌ మే డే కానుక

CM KCR: తెలంగాణ పారిశుద్ధ్య కార్మికులకు మేడే గిఫ్ట్‌ అందించారు సీఎం కేసీఆర్‌. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షా 6 వేల 474 మంది కార్మికులకు.. నెల జీతం వేయి రూపాయలు పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన జీతాలు తక్షణమే అమల్లోకి రానున్నాయి. తెలంగాణ పల్లెలు, పట్టణాలు గుణాత్మక అభివృద్ధిని సాధించడంలో పారిశుద్ధ్య కార్మికుల శ్రమ ఉందన్నారు సీఎం. సఫాయన్న నీకు సలాం అన్న నినాదంతో పారిశుధ్ద్య కార్మికుల కృషిని ప్రభుత్వం గుర్తి్స్తుందన్నారు. కార్మికుల సంక్షేమానికి, అభివృద్ధికి ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని తెలిపారు. ఇక త్వరలోనే ఆర్టీసీ కార్మికులకు జీతాలు పెంచాలని నిర్ణయం తీసుకున్న సీఎం.. అందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చారు.

Dhatripriya

Dhatripriya

Next Story