CM KCR: బంగారు భారత్ ను తీర్చిదిద్దుకుందాం

CM KCR: దేశ రాజకీయాల్లో కీలకంగా మారాలని చూస్తున్న ముఖ్యమంత్రి

Rama Rao
Published on: 22 Feb 2022 6:21 AM IST
CM KCR is Looking to Become National Politics | TS News Today
X

CM KCR: బంగారు భారత్ ను తీర్చిదిద్దుకుందాం 

CM KCR: బంగారు భారత్ దిశగా అడుగులు వేసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కొత్త వేదిక ద్వారా దేశ రాజకీయాల్లో కీలకంగా మారాలని భావిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. అన్ని వేదికలను దేశ రాజకీయాలకు ఉపయోగపడేలా చూసుకుంటున్నారు. సభ వేదికల నుంచే ప్రజల అభిప్రాయాన్ని సేకరిస్తున్నారు.

దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ కీలకంగా మారనున్నారు. అవకాశాలను తనకు అనుగుణంగా మల్చుకొని దేశ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అందుకే ఢిల్లీకి వెళ్లి పోరాడుదామంటూ ప్రకటించారు సీఎం. దేశ రాజకీయాల్లో ఇలాంటి పెను మార్పులు తీసుకురావడానికి ఎలాంటి ప్రణాళికలు సిద్ధంచేశారు. కూటమిలో ఎవరిని చేర్చుకోవాలి. ఎవరెవరు ఉండాలన్న దానిపై సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ వ్యతిరేక శక్తులతో పాటు కేంద్రంపై కోపంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను కలుపుకపోతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో అనుబంధంగా ఉంటూ పాలన కొనసాగిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రాంతీయ పార్టీల నేతలు సీఎం కేసీఆర్‌ వెంట నడుస్తాయా లేదా అన్ని పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Rama Rao

Rama Rao

Next Story