వికారాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

Vikarabad: వికారాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ మంగ‌ళ‌వారం సాయంత్రం ప్రారంభించారు.

Arun Chilukuri
Published on: 16 Aug 2022 5:23 PM IST
CM KCR Inaugurated Integrated District Offices Complex in Vikarabad
X

వికారాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్ 

Vikarabad: వికారాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ మంగ‌ళ‌వారం సాయంత్రం ప్రారంభించారు. క‌లెక్ట‌రేట్‌లో సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఎన్నేప‌ల్లిలో సమీ‌కృత కలె‌క్ట‌రే‌ట్‌కు 34 ఎక‌రాల భూమి కేటా‌యిం‌చగా రూ.60.70కోట్లు వెచ్చించి నిర్మాణం చేప‌ట్టారు. ఈ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో మంత్రులు స‌బితా ఇంద్రారెడ్డి, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కొప్పుల మ‌హేశ్వ‌ర్ రెడ్డి, కాలే యాద‌య్య‌, పైల‌ట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు సుర‌భి వాణిదేవి, ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డితో పాటు ప‌లువురు నాయ‌కులు పాల్గొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story