CM KCR: సుందర్ లాల్ బహుగుణ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

CM KCR: చెట్ల నరికివేతను వ్యతిరేకిస్తూ చిప్కో ఉద్యమాన్ని (చెట్లను కౌగిలించుకోవడం) నడిపిన, ప్రముఖ పర్యావరణ వాది, సుందర్ లాల్ బహుగుణ మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు.

Arun Chilukuri
Published on: 21 May 2021 4:41 PM IST
CM KCR has Mourned the Death of Environmental Activist Sunderlal Bahuguna
X

CM KCR: సుందర్ లాల్ బహుగుణ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

CM KCR: చెట్ల నరికివేతను వ్యతిరేకిస్తూ చిప్కో ఉద్యమాన్ని (చెట్లను కౌగిలించుకోవడం) నడిపిన, ప్రముఖ పర్యావరణ వాది, సుందర్ లాల్ బహుగుణ మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఐదు దశాబ్దాలుగా పర్యావరణ సమస్యలపై, చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ, అంతరించిపోతున్న వృక్ష, జంతు, పక్షిజాతుల రక్షణ కోసం జీవితాంతం కృషి చేస్తూ, తన జీవితాంతం పరితపించిన బహుగుణ మరణం ప్రకృతి, జీవావరణ, పర్యావరణ రంగానికి తీరని లోటని సీఎం అన్నారు. బహుగుణ కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story