సీఎం కేసీఆర్ మనవడికి గాయాలు

X
Highlights
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మనవుడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు బుధవారం గాయపడ్డాడు. కాలికి...
Arun Chilukuri1 Oct 2020 11:48 AM GMT
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మనవుడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు బుధవారం గాయపడ్డాడు. కాలికి ఫ్యాక్చర్ అయినట్లు తెలిసింది. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న అతడిని చికిత్స కోసం బుధవారం రాత్రి సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేర్పించారు. కనీసం నిలబడలేక పోతున్న హిమాన్షుకు వైద్యులు సీటీస్కాన్ చేశారు. తుంటి, మోకాలికి ఫ్యాక్చర్ అయినట్లు గుర్తించిన వైద్యులు అతనికి చికిత్సచేసి కట్టుకట్టారు. హిమాన్షు ఇంట్లో ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడ్డారని సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు. హార్స్ రైడింగ్ చేస్తుండగా కిందపడి గాయాలపాలైనట్లు మరొక ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Web Titlecm KCR grandson Himanshu injured and admitted in the hospital
Next Story