Telangana: ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్

Telangana: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు.

Arun Chilukuri
Published on: 17 March 2021 4:37 PM IST
CM KCR Good News to Telangana Employees
X

Telangana: ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్

Telangana: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. శాసనసభ వేదికగా రెండు, మూడు రోజుల్లో గౌరవప్రదమైన పీఆర్సీ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగులమీద తమకెంత ప్రేమ ఉందో గత పీఆర్సీతోనే చూపించామన్న కేసీఆర్ ఉద్యోగులు కాలర్ ఎత్తుకుని ఇండియాలోనే అత్యధిక జీతాలు పొందుతున్నామని చెప్పుకునే విధంగా జీతాలు ఇస్తామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ముగిసిన నేప‌థ్యంలో పీఆర్సీ ప్ర‌క‌టిస్తామ‌న్నారు.

సెక్రటేరియేట్‌లోని ప్రార్థనా మందిరాల్ని అదే ప్రాంతంలో నిర్మిస్తామని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. సెక్రటేరియట్ నిర్మాణంలో భాగంగా ఆలయాలు ధ్వంసం అయినమాట వాస్తవమే అన్న కేసీఆర్ అదేస్థానంలో ఆలయాలను తిరిగి నిర్మిస్తామన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story