Heart Attack: గుండెపోటుతో 10వ తరగతి విద్యార్థిని మృతి

Representational Image
x

 Heart Attack: గుండెపోటుతో 10వ తరగతి విద్యార్థిని మృతి

Highlights

Heart Attack: కామారెడ్డి జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. పదవ తరగతి విద్యార్థిని గుండెపోటుతో మరణించింది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం...

Heart Attack: కామారెడ్డి జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. పదవ తరగతి విద్యార్థిని గుండెపోటుతో మరణించింది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం సింగరాయిపల్లికి చెందిన విద్యార్థిని శ్రీనిధి చదువు నిమిత్తం కామారెడ్డిలోని కల్కినగర్ లో తన పెద్దనాన్న ఇంట్లో ఉంటూ ఓ ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుకుంటోంది. గురువారం ఉదయం ఇంటి నుంచి భోజనం చేయకుండా టిఫిన్ బాక్స్ తో ఆమె స్కూల్ కు వెళ్లింది. కాలినడకన వస్తూ పాఠశాలకు సమీపంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పాఠశాల యాజమాన్యం అక్కడికి చేరుకుని విద్యార్థినిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది. సీపీఆర్ చేసి రక్షించే ప్రయత్నం చేశారు. పరిస్థితిలో మార్పు లేకపోవడంతో మరో ఆసుపత్రికి తరలించారు. అక్కడ సీపీఆర్ చేస్తూ చికిత్స అందిస్తుండగానే ప్రాణాలు కోల్పోయిందని పాఠశాల యాజమాన్యం, డాక్టర్లు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories