Civils Prelims Exam 2020: నేడు సివిల్స్‌ ప్రిలిమ్స్‌...మాస్కులు ఉంటేనే అనుమతి

Civils Prelims Exam 2020: నేడు సివిల్స్‌ ప్రిలిమ్స్‌...మాస్కులు ఉంటేనే అనుమతి
x
Highlights

Civils Prelims Exam 2020: ఈ ఏడాది జరిగే సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ–2020 పరీక్ష ఆదివారం యూపీఎస్సీ ఆధ్వర్యంలో జరుగనుంది. ఈ పరీక్షలు నిర్వహించడానికి...

Civils Prelims Exam 2020: ఈ ఏడాది జరిగే సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ–2020 పరీక్ష ఆదివారం యూపీఎస్సీ ఆధ్వర్యంలో జరుగనుంది. ఈ పరీక్షలు నిర్వహించడానికి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 115 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే తెలంగాణలో హైదరాబాద్, వరంగల్‌ కేంద్రాలలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను ఉదయం 9.30 గంటల నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4.30 వరకు రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నారు. ఇక వరంగల్‌లోని 16 కేంద్రాలలో 6,763 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు వెల్లడించారు. అదే విధంగా హైదరాబాద్‌లో 99 పరీక్షా కేంద్రాలలో 46,171 మంది పరీక్ష రాయనున్నారని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్, ఎన్నికల కో–ఆర్డినేటింగ్‌ సూపర్‌వైజర్‌ శ్వేతా మహంతి తెలిపారు. ఇక ఈ పరీక్షా కేంద్రాల నిర్వహణ కోసం హైదరాబాద్‌లో వెన్యూ సూపర్‌ వైజర్లతో పాటు 99 లోకల్‌ ఇన్‌స్పెక్షన్‌ అధికారులు, 34 మంది రూట్‌ ఆఫీసర్లను నియమించారు.

పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల నిబంధనల విషయానికొస్తే అభ్యర్థులు తప్పని సరి పరిస్థితుల్లో మాస్కులను ధరించి సెంటర్ కు రావాల్సి ఉంటుంది. అప్పుడే అభ్యర్థులను పరీక్షకు అనుమతిస్తారు. వారి గుర్తింపు కార్డు, అడ్మిట్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుంది. పర్సులు, వాచ్, మొబైల్‌ ఫోన్స్, పెన్‌డ్రైవ్, కాలుక్యులేటర్లు, ఇతర రికార్డింగ్‌ పరికరాలు అనుమతించరు. ఎలక్ట్రానిక్‌ పరికరాలు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు. హాల్‌టికెట్‌లో సూచించిన పరీక్షా కేంద్రాల్లో మాత్రమే పరీక్షకు అనుమతి.

Show Full Article
Print Article
Next Story
More Stories