TS EdCET 2020 Hall Tickets : టీఎస్ ఎడ్సెట్ 2020 హాల్ టిక్కెట్లను ఈ విధంగా డౌన్ లోడ్ చేసుకోండి

Sumitra
Published on: 20 Sept 2020 12:21 PM IST
TS EdCET 2020 Hall Tickets : టీఎస్ ఎడ్సెట్ 2020 హాల్ టిక్కెట్లను ఈ విధంగా డౌన్ లోడ్ చేసుకోండి
X

TS EdCET 2020 Hall Tickets : తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టిఎస్‌సిహెచ్ఇ) టీఎస్ ఎడ్సెట్ 2020 హాల్ టిక్కెట్లను ఈ రోజు విడుదల చేయనుంది. విడుదల చేసిన హాల్ టికెట్లను అధికారిక వెబ్ సైట్ లో సెప్టెంబర్ 20నుంచి అందుబాటులో ఉంచనుంది. ఈ సందర్భంగా టిఎస్ ఎడ్సెట్ కన్వీనర్ మృణాలిని మాట్లాడుతూ ఈ పరీక్షలను అక్టోబర్ 1, 3 తేదీల్లో నిర్వహిస్తామని తెలిపారు. అక్టోబర్ 1వ తేదీన మధ్యాహ్నం సెషన్‌లో అంటే మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 వరకు, అదే విధంగా అక్టోబర్ 3వ తేదీని ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 3 నుండి 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని ఆమె స్పష్టం చేసారు.

అంతే కాకుండా తెలుగు, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు వేరువేరుగా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. తెలుగు మీడియం అభ్యర్థులకు ఉదయం పూట, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు మధ్యాహ్నం సమయంలో పరీక్ష నిర్వహించబడుతుందన్నారు. పరీక్ష కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులు అధికారిక సైట్ - edcet.tsche.ac.in లోకి లాగిన్ అయి తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. తెలంగాణలోని విద్యా కళాశాలల్లో బీఈడీ రెగ్యులర్ కోర్సులో ప్రవేశానికి తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టిఎస్‌సిహెచ్ఇ) తరపున పరీక్షలను ఈ ఏడాది టీఎస్ఎడ్సెట్ హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది.

టీఎస్ ఎడ్సెట్ 2020 హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే విధానం..

ముందుగా టీఎస్ ఎడ్సెట్ అధికారిక వెబ్ సైట్ Edcet.tsche.ac.in లోకి లాగిన్ అవ్వాలి.

తరువాత డౌన్‌లోడ్ హాల్ టిక్కెట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చెయాలి.

అలా చేయడానే అభ్యర్థి హాల్ టికెట్ స్క్రీన్ పై కనిపిస్తుంది.

వెంటనే దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకోవాలి.

Sumitra

Sumitra

Next Story